Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో ఆ MLA చిలిపి చేష్టలు.. సోషల్ మీడియాలో వైరల్

తెలంగాణలో ఆ MLA చిలిపి చేష్టలు.. సోషల్ మీడియాలో వైరల్

మాన‌కొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. న్యూ ఇయర్ సందర్భంగా మాన‌కొండూరు నియోజకవర్గంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరైన ఈ వేడుకలో కేక్ కటింగ్ చేశారు. అనంతరం ఒకరికి ఒకరు కేక్ తినిపించుకుంటూ విష్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సత్యనారాయణ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. మహిళ చెంపపై ఎమ్మెల్యే కేక్ పూశారు. దీంతో ఆమె అసౌకర్యంగా ఫీల్ అయినట్లు కనిపించారు. మంత్రిని పక్కకు జరిపి మరీ ఎమ్మెల్యే సత్యానారాయణ మహిళకు కేక్ పూసిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. మహిళ పట్ల ఎమ్మెల్యే సత్యనారాయణ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Recent

- Advertisment -spot_img