Homeహైదరాబాద్latest Newsఆగ్నేయాసియా చరిత్రలోనే భారీ కుంభకోణం

ఆగ్నేయాసియా చరిత్రలోనే భారీ కుంభకోణం

Truong My Lan case

బ్యాంకును తన గుప్పిట్లో పెట్టుకొని ఆగ్నేయాసియా చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడింది వియాత్నాంకు చెందిన ట్రూంగ్ మై లాన్ అనే మహిళ. దాదాపు 44 బిలియన్ డాలర్లు (రూ. 3.6 లక్షల కోట్లు) స్కామ్ చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఎస్‌సీబీ అనే బ్యాంకు నుంచి తప్పుడు పత్రాలతో రుణాలు పొందినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం కొందరు అధికారులకు లంచాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కేసు విచారణలో 2700 మంది సాక్షులు, పది రాష్ట్రాల ప్రాసిక్యూటర్లు, 200 మంది లాయర్లు పాల్గొన్నారు. దాదాపు ఆరు టన్నుల బరువైన 104 బాక్సుల పత్రాలను న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టారు. 1000 ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ట్రూంగ్‌కు ఇప్పుడు న్యాయస్థానం మరణశిక్ష విధించింది.

Recent

- Advertisment -spot_img