హైదరాబాద్, ఇదేనిజం – బీజేపీ ఓబీసీ మొర్చా రాష్ట్ర అధ్యక్షుడుగా ఇటీవల ఎన్నికైన ఆలే భాస్కర్ రాజ్‌ను ఆయన నివాసంలో గురువారం యూసఫ్ గూడ బీజేపీ నాయకులు, ఓబీసీ మోర్చా జూబ్లీహిల్స్ కన్వీనర్ సతీష్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టాలని, పార్టీని డివిజన్ స్థాయిలో పటిష్టం చెయ్యాలని సూచించినట్లు తెలిపారు.