Homeహైదరాబాద్latest NewsBoat Accident: పడవ బోల్తా.. ఏడుగురు మృతి

Boat Accident: పడవ బోల్తా.. ఏడుగురు మృతి

ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లా మహానదిలో 50 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న పడవ శుక్రవారం బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. అయితే ఓ వ్యక్తి ఆచూకీ తెలియకపోవడంతో, శనివారం కూడా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శనివారం ఉదయం ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురి మృతదేహాలు లభించగా, మరోకరి ఆచూకీ గల్లంతైనట్టు సీనియర్ పోలీసు అధికారి చింతామణి ప్రధాన్ ధృవీకరించారు.

బోటు బర్‌గఢ్ జిల్లా బంధిపాలి ప్రాంతం నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తోంది. మార్గమధ్యంలో జర్సుగూడలోని శారదా ఘాట్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బోటు బోల్తా పడింది. శుక్రవారం ఆలస్యంగా విలేకరులతో జిల్లా కలెక్టర్ కార్తికేయ గోయల్ మాట్లాడుతూ.. ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ జార్సుగూడ జిల్లా యంత్రాంగం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి సహాయంతో తప్పిపోయిన వ్యక్తుల కోసం అన్వేషణను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Recent

- Advertisment -spot_img