Homeహైదరాబాద్latest Newsరుణమాఫీ కోసం కదం తొక్కిన అన్నదాత..!

రుణమాఫీ కోసం కదం తొక్కిన అన్నదాత..!

కామారెడ్డి జిల్లా, వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా షరతులు లేకుండా రైతులందరికీ రూ. 2 లక్షల రుణం మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతులు సోమవారం గాంధారి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. పార్టీలకు అతీతంగా జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు ప్రధాన రహదారిపై బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాస్ పుస్తకాలే ప్రామాణికంగా రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే సురేందర్ ధర్నాలో పాల్గొని రైతులకు సంఘీభావం ప్రకటించారు.

spot_img

Recent

- Advertisment -spot_img