Homeహైదరాబాద్latest Newsబీఆర్ఎన్ పార్టీ ప్రమాద బీమా చెక్కును కార్యకర్త కుటుంబానికి అందజేత

బీఆర్ఎన్ పార్టీ ప్రమాద బీమా చెక్కును కార్యకర్త కుటుంబానికి అందజేత

ఇదే నిజం, గూడూరు: మండల కేంద్రం పరిధిలోని,బొల్లేపల్లి గ్రామ పంచాయితీ లో గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు, బానోతు గణపతి మరణించారు. వారి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రమాద బీమా రెండు లక్షల రూపాయల చెక్కును ఈరోజు వారి కుటుంబానికి అందజేశారు. ఈ ప్రమాద బీమా చెక్కు రావడానికి సహకరించిన మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, మండల పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వేం వెంకటకృష్ణారెడ్డి. మండల ప్రధాన కార్యదర్శి నూకల సురేందర్, బొల్లెపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు బానోతు హరి, సొల్లేటి వెంకటాచారి, అజ్మీర రవి, బానోత్ రాజన్, చీర శ్రీనివాస్, మాలోత్ బీమా, మంగ మహేందర్, గుగులోతు ఈరు, హెచ్. శ్రీనివాస్, బానోత్ అనిల్ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img