అనుమతులు ఉన్న వాళ్ళు హైడ్రాకు భయపడాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని చార్మినార్ వద్ద శనివారం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. బుల్డోజర్ సిద్ధంగా ఉంచాను.. ఎవరు అడ్డం వచ్చి పడుకుంటారో రండి అంటూ సీరియస్ అయ్యారు. హైడ్రా అనగానే కేటీఆర్, హరీష్ రావు బయటకొచ్చారని విమర్శించారు. మూసీని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఇళ్లను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.