– తప్పిన పెను ప్రమాదం
ఇదేనిజం, హనుమకొండ : ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం హనుమకొండ జిల్లాలోని ఓగులపూర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్`2 డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు హనుమకొండ నుంచి ఏటూరు నాగారం వెళుతోంది. ఈ క్రమంలో ఓగులపూర్ వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పెను ప్రమాదం తప్పడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.