Homeహైదరాబాద్latest Newsవరి పొలాన్ని తలపిస్తున్న బస్టాండ్ ఆవరణ.. ఫిర్యాదు చేసిన పట్టించుకోని ఆర్టీసీ డిపో మేనేజర్

వరి పొలాన్ని తలపిస్తున్న బస్టాండ్ ఆవరణ.. ఫిర్యాదు చేసిన పట్టించుకోని ఆర్టీసీ డిపో మేనేజర్

ఇదేనిజం, గూడూరు: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ ప్రాంగణం మొత్తం చిరుజల్లులకే, బస్టాండ్ లోని బస్సులు వచ్చి వెళ్తున్న తరుణంలో, వరి నాట్లు వేసే పొలం మడిని తలపిస్తుందని, అంతేగాక బస్టాండ్ ఎంట్రన్స్, ఎగ్జిట్ రోడ్డుకు ఇరుపక్కల వాహనాలు టూ వీలర్స్ పార్కింగ్ చేయడం మూలాన, బస్సులు టర్నింగ్ లలో కట్చేయడం ఎంతో కష్టంగా మారి చాలా ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లు. అలాగే బస్సుల కోసం బస్టాండ్ కు లగేజీలతో కాలినడకనపోయే ప్రయాణికులు బురద వల్ల ఎంతో నరకయాతనకు గురవుతున్నారు. ప్లాట్ ఫామ్ దిగి బస్సు ని ఎక్కాలన్నా? దిగాలన్నా? సజావుగా ఎక్కలేని దీన పరిస్థితి.

బస్టాండ్ లో కంట్రోలర్లు ఇద్దరు బదులుగా ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్న తరుణంలో, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే కంట్రోలర్ ఉంటున్నారు. వ్యక్తిగత కారణాలవల్ల ఒక్కో రోజు కంట్రోలర్ విధులకు హాజరు కాలేక పోతున్నాడు. అదేవిధంగా రాత్రి 6:30, 7:00 గంటలు దాటితే బస్టాండ్ లోనికి బస్సులు వెళ్లకుండానే, నేరుగా రోడ్డుపై నుండే వెళ్ళిపోతున్న వైనం. ఇది గమనించి ఇప్పటికైనా ఇద్దరు కంట్రోలర్లను విధులకు ఉపక్రమిస్తే బాగుంటుందని, అలాగే బస్టాండ్ లో ఇంతవరకు అనౌన్స్ చేసే మైకులను ఏర్పాటు చేయకపోవడం. బస్సులు బయలుదేరు వేళల బోర్డును అమర్చకపోవడం. తాత్కాలికంగా కొన్ని బెంచ్ లు మాత్రమే ఏర్పాటు చేశారు.

మరికొన్ని బెంచీలు, బస్టాండ్ సమీపంలో యాక్సిడెంట్ లు జరుగుతున్న నేపథ్యంలో, జనవాసాలకు కొంచెం దూరంగా బస్ స్టాండ్ ఉండటంవల్ల, రాత్రి వేళల్లో టాయిలెట్స్ కు ఉన్న తలుపులను సైతం ధ్వంసం చేశారు. ఆర్టీసీ సంస్థ ఆస్తికి నష్టం జరుగుతున్నందునా,సంఘ వ్యతిరేక, అసాంఘిక, అశ్లీల కార్యకలాపాలకు అడ్డాగా నిలయమైందనే చర్చలకు తావిస్తున్న నేపథ్యంలో, నిఘా నేత్రాలను సైతం ఏర్పాటు చేయాలని. బస్టాండ్ ను పునర్నిర్మానం చేసిన మూడు నెలలకే, బస్టాండు భవనం లోపట బయట గోడలు, స్లాబ్ మొత్తం పాకూరుమయం అయింది.

ఇందులో ఉన్న రెండు షెట్టర్లను ఏర్పరిచిన రూములు చిరుజల్లులకే కురుస్తున్న తీరు, ప్రజా ఖజానాకు తూట్లు పొడిచినట్లయిందని ప్రజలు విస్మయం చెందుతున్నారు. ప్రాంగణంలో ప్రస్తుతానికి చిప్స్, డస్టులను ఏర్పాటు చేసి చదును చేపిస్తే, బురుదమయం వల్ల ఏర్పడే ఇబ్బందుల నుండి ప్రయాణికులను, నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మి తొలగించినవారౌతారని, తక్షణమే స్పందించి ఈ సదుపాయాలను ఇప్పటికైనా సమకూరుస్తే, బస్టాండ్ కు ఒక రక్షణ కవచంలా ఉంటాయని, గూడూరు మండల ప్రజలు, ప్రయాణికులు, విద్యావేత్తలు, మేధావివర్గం బాగుంటుందని భావిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img