గత ఐదు సంవత్సరాలుగా ఏపీ ప్రజలను వెంటాడుతున్న ఏకైక ప్రశ్న.. రాజధాని ఏది..?. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం తెలిసిపోయింది. ఎలాగో తెలుసా.. అమరావతే రాజధాని అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన టీడీపీకి విజయం దక్కింది. మూడు రాజధానుల విధానంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీ పరాజయం ఎదురైంది. అంటే.. రాష్ట్ర ప్రజలు అమరావతికే ఓటేశారని అనుకోవచ్చు. అమరావతి విషయంలో జగన్ మోహన్ రెడ్డి విధానాన్ని ప్రజలు అంగీకరించలేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.