Hyderabad : హైదరాబాద్‌లో ఫూటుగా తాగి సోయి లేకుండా కారు నడిపి బీభత్సం సృష్టించాడు ఓ వ్యక్తి. హైదరాబాద్ ఐకియా కారిడార్‌లోని ఐకియా నుంచి రాయదుర్గం కామినేని అస్పత్రి వరకు వరుసగా ఆరు ప్రమాదాలకు కారణమయ్యాడు. ఈ ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు.
నిజాంపేట ప్రగతినగర్‌కు చెందిన పాతర్ల క్రాంతికుమార్ యాదవ్ ఆదివారం రాత్రి ఫుల్‌గా మద్యం తాగాడు. ఆ మత్తులో కారులో బయలుదేరి ఐకియా రోటరీ వద్దకు చేరుకున్నాడు. కారు, ఆటో, పాదచారులను గుద్దుకుంటూ వెళ్లాడు. ఒక ప్రమాదం చేసి తప్పించుకునేందుకు మరో ప్రమాదం..ఇలా గంట వ్యవధిలోనే ఆరు రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యాడు. గమనించిన స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. మీటర్ రీడింగ్‌లో 550 చూపించగా పోలీసులు అవాక్కయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.