– దంపతులు మృతి.. నలుగురికి గాయాలు
– మెదక్ జిల్లాలో విషాదం
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: దసరా పండుగ షాపింగ్ కోసం హైదరాబాద్కు వచ్చి సొంతూరుకి వెళ్తున్న దంపతులు కారు బోల్తా పడి చనిపోయారు. ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోలక్ పల్లికి చెందిన నారాయణ (60), దేవమణి (57) అనే దంపతులు దసరా షాపింగ్ కోసం కారులో హైదరాబాద్ వచ్చారు. బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బోధన్ వెళ్తుండగా మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ గ్రామ శివారులో వీరి కారు బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నారాయణ, దేవమణి అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదంలో కారులో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడగా వారిని సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.