తమిళ హీరో ధనుష్ మరియు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య పరస్పర విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారు, వారి తదుపరి విచారణ అక్టోబర్ 19న జరగనుంది. 2004లో వివాహం చేసుకుని ఇద్దరు కుమారులు ఉన్న ఈ జంట తమ మధ్య విభేదాల కారణంగా 2022లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఐశ్వర్య ధనుష్ ఈ ఏడాది విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా… వారి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఇదిలా ఉండగా ధనుష్-ఐశ్వర్యల విడాకుల కేసు నిన్న చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విచారణకు రాగా.. ఐశ్వర్య, ధనుష్ ఇద్దరూ కోర్టుకు హాజరు కాకపోవడంతో కేసును అక్టోబర్ 19కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.