కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు మార్పుపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మార్చే ప్రతిపాదనను పరిశీలించడం లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. లోక్‌సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లుగా ఉంది.