దేశంలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ షాపులను (FPS) జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చబోతున్నట్లు ప్రకటించింది. బియ్యం, ఉప్పు, పప్పులతో పాటు విభిన్న రకాల పోషక ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు లబ్ధిదారులకు పోషకాలు అందించడంతోపాటు రేషన్ షాప్ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.