Homeహైదరాబాద్latest Newsఖమ్మం మునిగినా గడపదాటని ముఖ్యమంత్రి.. సహాయక చర్యల్లో సర్కార్ ఫెయిల్..!

ఖమ్మం మునిగినా గడపదాటని ముఖ్యమంత్రి.. సహాయక చర్యల్లో సర్కార్ ఫెయిల్..!

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఖమ్మం జిల్లా కేంద్రం నీట మునిగినా ముఖ్య మంత్రికి చీమ కుట్టినట్టు కాలే.. ముగ్గురు మంత్రులు ఉండి కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేకపోయారు. మున్నేరు వాగు దాటికి ఖమ్మం జిల్లా కేంద్రం దాదాపు జలవిలయంలో చిక్కుకుపోయింది. కానీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో సర్కారు ఫెయిల్ అయ్యిందని విమర్శలు వస్తున్నాయి. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన మీద పట్టు ఉందా? అన్న విమర్శలు వస్తున్నాయి.

రాష్ట్రం మొత్తం వానలు పడుతుంటే వందల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులు అవుతుంటే సీఎం రేవంత్ కనీసం సచివాలయానికి రాలేదు. కేవలం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సరిపెట్టారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో వరద బాధితులు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును చుట్టుముట్టి నిరసన తెలిపారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకొని డ్రామాలు ఆడారన్న విమర్శలు వస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img