Homeహైదరాబాద్latest NewsWGL: దారుణం.. నీటి సంపులో పడి చిన్నారి చనిపోయింది

WGL: దారుణం.. నీటి సంపులో పడి చిన్నారి చనిపోయింది

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండల పరిధిలోని చలపర్తి గ్రామంలో బుధవారం నీటి సంపులో పడి చిన్నారి మృతిచెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుండెబోయిన కీర్తన, జగదీష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ప్రమాదవశాత్తూ.. ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడింది. కుటుంబ సభ్యులు ఎంతకీ వెతికినా కనిపించలేదు. దీంతో నీటి సంపులో చూడగా.. అప్పటికే చిన్నారి మృతిచెంది ఉండడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. చిన్నారి మృతితో చలపర్తి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై దుగ్గొండి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ RTCలో ఉద్యోగాలు.. త్వరపడండి..

ఇది కూడా చదవండి: KTR సంచలన వ్యాఖ్యలు.. హామీలు అమలు చేయకపోతే నడిరోడ్డుపై..

Recent

- Advertisment -spot_img