Homeహైదరాబాద్latest Newsరాత్రి వేళల్లో వెన్నులో వణుకు పుట్టిస్తున్న చలి.. ఈ జిల్లాలకు అలర్ట్..!

రాత్రి వేళల్లో వెన్నులో వణుకు పుట్టిస్తున్న చలి.. ఈ జిల్లాలకు అలర్ట్..!

తెలంగాణలో రాబోయే 3 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు కనిష్ఠ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)లో 8.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ లో అత్యల్పంగా 8.8, ఆదిలాబాద్ జిల్లా బేలలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Recent

- Advertisment -spot_img