Homeహైదరాబాద్latest Newsగచ్చిబౌలిలో ఓరిగిన భవనం.. కూల్చివేతలు చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు..!

గచ్చిబౌలిలో ఓరిగిన భవనం.. కూల్చివేతలు చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు..!

ఇదే నిజం, శేరిలింగంపల్లి: గచ్చిబౌలిలో  5 అంతస్తుల భవనం ఉన్నట్టుండి రాత్రి 8 గంలకు ఒవైపునకు ఒరిగింది.  దీంతో అందులో ఉండే వారితోపాటు చుట్టూ పక్కన ఉండే ప్రజలు తీవ్ర భయాందోళనకు  గురై పరుగులు పెట్టారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గచ్చిబౌలి సిద్దిక్ నగర్లో 2 ఎండ్లకిందట   5 అంతస్తుల భవనం నిర్మించారు.  ఆ భవనం మంగళవారం రాత్రి ఉన్నట్టుండి పెద్ద శబ్దం చేస్తూ  ఒకవైపుకు ఒరిగింది. దీంతో అందులో ఉండే వారితో పాటు స్థానికులు ఒక్కసారిగా ఏమీ జరుగుతుందో అని పరుగులు పెట్టడమే గాకుండా తీవ్ర భయాందోళనలు గురయ్యారు. వెంటనే అప్రమత్తం కావడంతో  తృటిలో  పెను ప్రమాదం తప్పింది.  ఈ భవనం పక్కన ఇంకో ఇంటి నిర్మాణ కోసం సెల్లర్ గుంత తవ్విన కారణంగానే ఇలా జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. 
కూల్చివేతలు చేపట్టిన హైడ్రా అధికారులు
ఒరిగిన భవనాన్ని కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఉపక్రమించారు. చుట్టు పక్కల ఉన్న నివాసాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించి  భవనాన్ని కూల్చి  వేయిస్తున్నారు. కూల్చి వేతలను జీహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img