Homeజిల్లా వార్తలు10:30 దాటినా కళాశాలకు తాళం

10:30 దాటినా కళాశాలకు తాళం

ఇదే నిజం జుక్కల్: జుక్కల్ నియోజకవర్గం నిజాం సాగర్ మండలం జూనియర్ కళాశాలకు గురువారం ఉదయం 10:30 గంటలు దాటినా అధ్యాపకులు, విద్యార్థులు రాలేదు. 21 మంది విద్యార్థులతో ఈ విద్యా సంవత్సరం జూనియర్ కళాశాలను ప్రారంభించారు. మొన్నటి వరకు లెక్చరర్ల నియామకం లేకపోవడంతో పిట్లం జూనియర్ కళాశాల నుంచి లెక్చరర్లు వచ్చి ఒకటి రెండు తరగతులు అప్పుడప్పుడు నిర్వహించేవారు. లెక్చరర్లు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారో తెలియకపోవడంతో విద్యార్థులు సైతం కళాశాలకు అప్పుడప్పుడు వచ్చేవారు. గత పది రోజుల కిందట నిజాంసాగర్ జూనియర్ కళాశాలకు ఓ లెక్చరర్ ను నియమించారు. అయినప్పటికీ గురువారం ఉదయం 10:30 గంటలు దాటినా లెక్చరర్ కళాశాలకు రాకపోవడంతో తాళాలు తీయలేదు. ఎలాగో లెక్చరర్లు రావడంలేదని విద్యార్థులు సైతం కళాశాలకు రావడం మానేశారు. అసలు కళాశాలలో తరగతులు జరగడంలేదని, పుస్తకాలు సైతం ఇంకా అందజేయలేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు చొరవచూపి నిజాంసాగర్ కళాశాలను గాడిలో పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img