Homeతెలంగాణసామాన్యుడు పట్టుదలతో ఏదైనా సాధిస్తాడు

సామాన్యుడు పట్టుదలతో ఏదైనా సాధిస్తాడు

హైదరాబాద్​, ఇదేనిజం : గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) సెంటర్ లో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకను రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ లెజెండరీ హాకీ క్రీడాకారుడు, పద్మభూషణ్, మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ క్రీడాకారులందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

కరోనా నేపథ్యంలో హుమ్యూనిటీని పెంచుకోవడానికి ఎవ్వరికి వారు తమ ఆరోగ్యం దృష్ట్యా ప్రతిఒక్కరు రోజుకు 15 నిమిషాల పాటు వాకింగ్, రన్నింగ్, యోగ చేసి “ఫిట్ తెలంగాణ ” లో భాగస్వాములు కావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. 

హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ మామూలు స్ధాయి నుంచి ఒలింపిక్స్ లో బంగారు పథకాలు సాధించి మన దేశం కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటారని మంత్రి అన్నారు. సామాన్యుడు పట్టుదలతో ఆడితే ఏదైనా సాధిస్తాడు అనడానికి ఉదాహరణ ధ్యాన్ చంద్. ధ్యాన్ చంద్ చరిత్ర ప్రతి క్రీడాకారుడు తెలుసుకునేందుకు ఆయన పుట్టిన రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించారన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతో పాటు వ్యాయామం అవసరమన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీఠ వేశామన్నారు. క్రీడాపాలసి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ సబ్ కమిటీ వేశారన్నారు. స్పోర్ట్స్ పాలసీ పై వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేస్తామన్నారు. మన రాష్ట్రంలో ప్రముఖ క్రీడాకారులు, కోచ్ ల సూచనలను పరిశీలించి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకువస్తామన్నారు.

సీఎం కేసీఆర్ మార్గదర్శనం లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం గా అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఒక క్రీడాకారుడు ఒలింపిక్స్ లో పతకాలు సాధిస్తే దేశానికి గొప్ప పేరు వస్తుందన్నారు. ప్రతి క్రీడాకారుడు ధ్యాన్ చంద్ గారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి శ్రీనివాస రాజు, క్రీడా శాఖ అధికారులు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img