తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం మూర్ఖత్వమే అని అన్నారు. ప్రభుత్వాలు చేయాల్సిన పని ఇవేనా ? అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం మార్పులు చేస్తూ ఉంటే ఎలా అని కేసీఆర్ అన్నారు. ప్రజా సమస్యలు, పరిష్కారాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని కేసీఆర్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని కేసీఆర్ ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో నిర్బంధ నిబంధనను ప్రస్తావించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. ప్రభుత్వాన్ని అంశాల వారీగా తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. ఫిబ్రవరిలో బీఆర్ఎస్ బహిరంగ సభ ఉంటుందని కేసీఆర్ తెలిపారు.