Homeహైదరాబాద్latest News'సిరిసిల్ల'ను సిరిశాలగా మార్చిన ఘనత కేటీఆర్ ది: కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్

‘సిరిసిల్ల’ను సిరిశాలగా మార్చిన ఘనత కేటీఆర్ ది: కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద యూత్ ఐకాన్, సిరసిల్లా ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలను యువజన నాయకులు ముందస్తుగా నిర్వహించారు. ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ను కట్ చేసి ఒకరికోకరు తినిపించుకోని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 24వ తేదిన కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఒక రోజు ముందుగా వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపినట్లు వెల్లడించారు. ఉరిశాలగా ఉన్న సిరిసిల్లను సిరుల సిల్లగా మార్చిన ఘనత కేటీఆర్ దే అని పేర్కోన్నారు. అలాగే నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిన యువ నాయకుడు కేటీఆర్ అని వెల్లడించారు. రాబోవు రోజుల్లో కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంతో బీఆర్ఎస్ పార్టీ మళ్లి అధికారంలోకి వస్తుందని వెల్లడించారు. ఇలాంటి పుట్టిన రోజు వేడుకలను మరిన్ని జరుపుకుంటూ ఉన్నత పదవులు ఆందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూత్ మండలాధ్యక్షులు శీలం స్వామి, నాయకులు బాలచంద్రం, కంచం నర్సింలు, తాడెపు అనిల్, శంకర్, సుదర్శన్, దిలీప్, నారాయణ, కోడె శ్రీనివాస్, భరత్, శ్రావన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img