Homeహైదరాబాద్latest Newsరైతు భరోసా కు ముహూర్తం ఫిక్స్.. ఎకరానికి రూ.7,500 అప్పుడే..!

రైతు భరోసా కు ముహూర్తం ఫిక్స్.. ఎకరానికి రూ.7,500 అప్పుడే..!

రైతు భరోసా పై రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న యాసంగి సాగుకు సాయం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రైతు భరోసా అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జనవరిలో ఎకరానికి రూ.7,500 చొప్పున యాసంగి సాగుకు సాయం అందించనుంది. ఈ మేరకు వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి రైతు భరోసా విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. గుట్టలు, కొండలు ఉన్న భూములతో పాటు స్థిరాస్తి వెంచర్లుగా మారిన ల్యాండ్కు రైతుభరోసా నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img