అరుణ్ జైట్లీ ఒకటో వర్ధంతి సందర్భం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనను స్మరించుకొన్నారు.
‘‘గడచిన సంవత్సరం లో ఇదే రోజున, అరుణ్ జైట్లీని మనం కోల్పోయాము. నా మిత్రుడు లేని లోటు నన్ను ఎంతగానో బాధిస్తోంది. అరుణ్ భారతదేశానికి ఏకాగ్రచిత్తంతో సేవలను అందించారు. ఆయన సమయ స్ఫూర్తి, వివేకం, చట్టానికి, న్యాయానికి సంబంధించిన నిశిత దృష్టి, ఇంకా స్నేహపూర్ణ వ్యక్తిత్వం కీర్తిని ఆర్జించాయి’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.