Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో క్రైమ్ రేట్‌పై వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ.. ఈ సారి నేరాల శాతం...

తెలంగాణలో క్రైమ్ రేట్‌పై వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ.. ఈ సారి నేరాల శాతం పెరిగింది..!

తెలంగాణ రాష్ట్రంలో 2024 సంవత్సరానికి సంబంధించిన వార్షిక క్రైమ్ నివేదికను డీజీపీ జితేందర్ విడుదల చేశారు. ఈ నివేదికలో తెలంగాణలో క్రైమ్ రేటుకు సంబంధించిన అంశాలను వెల్లడించారు. 2024లో తెలంగాణలో క్రైమ్ రేటు గణనీయంగా పెరిగిందన్నారు. 2023తో పోలిస్తే, ఈ ఏడాది 9.87 శాతం పెరిగి 2,34,158 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ ఏడాది తెలంగాణలో క్రైమ్ రేటు పెరిగినప్పటికీ, శాంతి భద్రతలు, సైబర్ క్రైమ్, డ్రగ్స్ పై అధికారుల చర్యలు విశేషమైనవిగా ఉన్నాయి. ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్న పోలీసులు, నూతన చట్టాల ద్వారా న్యాయ వ్యవస్థను మరింత సమర్థంగా చేశారని డీజీపీ ఈ సందర్భంగా తెలిపారు. 2024లో శాంతి, భద్రతల ప్రాముఖ్యత మరింత పెరిగినట్లుగా ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img