HomeసినిమాGuntur Karam : 'Dham Masala' Promo Guntur Karam : దుమ్మురేపిన ‘ధమ్ మసాలా’...

Guntur Karam : ‘Dham Masala’ Promo Guntur Karam : దుమ్మురేపిన ‘ధమ్ మసాలా’ Promo

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నమాస్ ఎంటర్​టైనర్​ ‘గుంటూరు కారం’. వచ్చే ఏడాది సంక్రాతికి రిలీజ్​ కానున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సాంగ్, టీజర్​ కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మ్యూజిక్​ అందిస్తున్న తమన్​ సైతం ఈ నెలలోనే ఫస్ట్ సాంగ్ వస్తుందని ఇటీవల ట్విట్టర్​లో ఎమోజీలను సైతం షేర్ చేశాడు. అయితే, ఫస్ట్ సాంగ్​ను మేకర్స్ రిలీజ్ చేసేలోగానే సోషల్ మీడియాలో పాటకు సంబంధించి మొదటి రెండు లైన్లు లీక్​ కావడం మూవీ యూనిట్ కాస్త కలవరానికి గురిచేసింది. వీలైనంత తొందరగా ఫస్ట్ సాంగ్​ను రిలీజ్​ చేసేందుకు సిద్ధమైన మేకర్స్.. ఆదివారం ప్రొమో కట్​ను వదిలారు. ‘ధమ్ మసాలా’అంటూ మొదలయ్యే ఈ సాంగ్ విజువల్స్​లో మహేశ్ మాస్ స్వాగ్ మాత్రం కంప్లీట్​​గా అదిరిపోయింది. మహేశ్ నుంచి ఓ పక్కా కమర్షియల్ మాస్ సినిమా పడితే ఎలా ఉంటుందో చూడాలి అని చాలా ఏళ్లుగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గుంటూరు కారంతో ఆ కోరిక తీరనున్నట్లు సాంగ్ ప్రోమో చూస్తే తెలుస్తుంది. అయితే, ధమ్ మసాలా ఫుల్​ సాంగ్​ను మేకర్స్ ఈ నెల 7న రిలీజ్ చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img