Homeజిల్లా వార్తలుపాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్.. వారికీ కీలక సూచనలు..

పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్.. వారికీ కీలక సూచనలు..

ఇదే నిజం నర్సంపేట: చెన్నారావుపేట మండల పరిధలోని ఉప్పరపెల్లి ప్రాధమిక మరియు హైస్కూల్ పాఠశాలలను జిల్లా కలెక్టర్ సత్య శారదా ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్శనలో కలెక్టర్ పాఠశాల మౌళిక వసతులను, తరగతి గదులు పరిశీలించారు. ఈ పరిశీలనలో పాఠశాలలో తరగతి గదులు పూర్తిగా పాడై పోయినవి. కావున తక్షణమే పాఠశాలలో తరగతి గదులకు షేడ్స్ నిర్మాణం చేయాలని జిల్లా, మండల అధికారులు కు సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం ను అందించాలని ఎక్కువగా ఐరన్ ఉన్న ఫుడ్ ను అందించాలని తెలిపారు. విద్యార్థులు పాఠశాలలో తప్పనిసరిగా పాద రక్షలు ధరించాలని తెలిపారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే అన్ని పాఠశాలల్లో వన మహోత్సవం కార్యక్రమంలో అందరూ మొక్కలు నాటాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి , ఎంఆర్ఓ పణీకుమార్, ఎంపిడిఓ జి.దయాకర్, ఎంఈ ఓ వి.రత్నమాల, మండల నోడల్ ఆఫీసర్ సరళ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు ఎం.పాపమ్మ , ఏ ఈ నరేష్ , పాఠశాలల ప్రధానోపాధ్యాయులు టి.జయ, పి.సుధాకర్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ షకిల్ అహ్మద్, ఎం.పి.టి.సి విజేందర్ రెడ్డి, కలాం ఫౌండేషన్ అధ్యక్షుడు భాషమియా, మధుకర్, అశోక్ మరియు వి.ఓ.ఫర్జానా, ఉపాద్యాయులు, ఎం.ఆర్.సి సిబ్బంది అశోక్, స్వప్న, సీఆర్పీ లు సంపత్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img