ఇదేనిజం, లక్షెట్టిపేట: పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని టీ టైమ్ పక్క నుండి వెళ్లే దారిలోని డ్రైనేజీపై గతంలో నిర్మించిన స్లాబ్ కూలీ పోయిందని, దానిని వెంటనే బాగు చేయాలని యూత్ అధ్యక్షుడు దర్శనాల నవీన్ డిమాండ్ చేశారు. బుధవారం అయన కూలిపోయిన రోడ్డును సందర్శించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వెంటనే మరమ్మత్తులు చేసి శాశ్వత పరిష్కారం చేయాలని ఆయన మున్సిపల్ అధికారులను అయన డిమాండ్ చేశారు.