ఇదే నిజం, నల్గొండ టౌన్: నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం విద్యార్థులు సి యం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. పరీక్షల సమయాన్ని మార్చాలని అనేక సార్లు రిజిస్టార్ కు విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. జిల్లా మంత్రి, ఇంచార్జి వి సి నవీన్ మిట్టల్ చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలని కోరారు.