Homeజిల్లా వార్తలుప్రభుత్వ విప్ కు వినతి పత్రం అందజేసిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం

ప్రభుత్వ విప్ కు వినతి పత్రం అందజేసిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి క్యాంపు కార్యాలయంలో జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కలిసి ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కి ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ పైన లెటర్ రాసి మీ సమస్యలు పరిష్కరిస్తానని ఫీల్డ్ అసిస్టెంట్లకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ విప్ కి ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం రమేష్, ఉపాధ్యక్షులు గౌడికర్ శ్రీనివాస్, కార్కూరి చంద్రశేఖర్, గోనెపల్లి మహేష్, జాలిగామ రాజేశం, సర్గం సంతోష్, మరియు ధర్మారం మండల బాధ్యులు సత్యనారాయణ రాజు, నిజకవర్గంలో ఉన్న అన్ని మండలాల యూనియన్ మండల అధ్యక్షులు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img