Homeహైదరాబాద్latest News'బిడ్డ ఉన్నా పర్వాలేదు.. నాకు మీనానే కావాలి' అని పట్టుబట్టిన ప్రముఖ హీరో..!

‘బిడ్డ ఉన్నా పర్వాలేదు.. నాకు మీనానే కావాలి’ అని పట్టుబట్టిన ప్రముఖ హీరో..!

1976లో చెన్నైలో జన్మించిన నటి మీనా ఆరేళ్ల వయసులో సినిమాల్లో నటించడం ప్రారంభించింది. 1982లో ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ నటించిన సినిమాలో మీనా బాలనటిగా నటించింది. బాలనటిగా పలు భాషల్లో 15కి పైగా చిత్రాల్లో నటించింది. దాదాపు 40 ఏళ్ల పాటు భారతీయ చిత్రసీమలో అత్యుత్తమ హీరోయినిగా నిలిచిన మీనా 2009లో విద్యాసాగర్‌ను వివాహం చేసుకున్నారు.
కానీ 2022లో విద్యాసాగర్ అనారోగ్యంతో మరణించడం యావత్ సినీ పరిశ్రమను, మీనాను ప్రేమించే అనేకమందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఓ వేదికపై మాట్లాడుతూ.. ఈ వయసులో మీనా తన భర్తను కోల్పోయినందుకు చాలా బాధగా ఉందని అన్నారు. అంతేకాదు, మీనా తన భర్త మరణించిన రెండేళ్ల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక కథనాలు వెలువడ్డాయి. ఈ వివాదంలో నటుడు ధనుష్ సహా పలువురు ప్రముఖ నటీనటుల పేర్లు కూడా రావడం గమనార్హం. అయితే మీనా మాత్రం చాలా వేదికలపై పెళ్లి చేసుకోను అని, తన కూతురే నా ప్రపంచం అని చెప్పినా ఆమె పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఒక ప్రముఖ హీరో మీనానే పెళ్లి చేసుకోవాలి అని పట్టుపడుతున్నాడు అంటా.. మీనాకి బిడ్డ ఉన్నా పర్వాలేదు అయన సరే నేను తననే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడుని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హీరో పేరు మాత్రం బయటకి రాలేదు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img