బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటిరోజు బౌలర్ల హవాకొనసాగింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నితీశ్‌రెడ్డి 41, పంత్ 37 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట పూర్తయ్యే సమయానికి ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. బుమ్రా 4, సిరాజ్ 2, హర్షిత్ ఒక వికెట్ తీశారు.