లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 1987లో వచ్చిన ‘నాయగన్’మూవీ తర్వాత 36 ఏండ్లకు వీరిద్దరు కలిసి చేస్తున్న సినిమా ఇది. కమల్ కెరీర్లో 234వ మూవీ కావడంతో.. వర్కింగ్ టైటల్‌ను ‘కేహెచ్ 234’గా మేకర్స్ ఫిక్స్ చేశారు. అయితే, నేడు కమల్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీకి సంబంధించి ఆయన ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మొహానికి ముసుగుతో కమల్ డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా త్రిష నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంతి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
The first look of ‘KH 2’34’ is exciting అదిరిపోయిన ‘కేహెచ్ 234’ ఫస్ట్ లుక్
RELATED ARTICLES