Homeతెలంగాణఫస్ట్​ రిజల్ట్ వచ్చేసింది

ఫస్ట్​ రిజల్ట్ వచ్చేసింది

– అశ్వారావు పేటలో కాంగ్రెస్ గెలుపు
– బీఆఎస్​ అభ్యర్థి నాగేశ్వరరావుపై గెలుపొందిన ఆదినారాయణ
– ఇల్లందులోనూ కాంగ్రెస్ అభ్యర్థి విజయం
– ఉత్తర తెలంగాణలోనూ హస్తం​ హవా
– ముగిసిన ఆరు రౌండ్ల కౌంటింగ్
–63 సెగ్మెంట్లలో లీడ్​లో కొనసాగుతున్న హస్తం పార్టీ
– హైదరాబాద్​లో బీఆర్ఎస్​కు ఆధిక్యత
– ఆదిలాబాద్​, నిజామాబాద్​,హైదరాబాద్​లో బీజేపీ ప్రభావం

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్​లో మొదటి ఫలితం వచ్చేసింది. అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణరావు గెలుపొందారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై ఆయన గెలుపొందారు. ఇల్లందులోనూ కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య గెలుపొందారు. ఉత్తర తెలంగాణలోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. దాదాపు 6 రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి 119 సెగ్మెంట్లకు గాను 65 చోట్లు కాంగ్రెస్​ లీడ్​లో ఉంది. ఆరుగురు బీఆర్ఎస్ మంత్రులు పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్​ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ వెనుకంజలో ఉన్నారు. గజ్వేల్​లో సీఎం కేసీఆర్ లీడ్​లో ఉండగా..కామారెడ్డి, కొడంగల్​లో రెండు చోట్ల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. మంత్రుల మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ ముందంజలో ఉన్నారు. గోషామహల్​లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య హోరాహెరీ నడుస్తోంది. అయితే, హైదరాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ సత్తా చాటుతోంది. దాదాపు 14 స్థానాల్లో లీడ్​లో కొనసాగుతోంది. బీజేపీ, ఎంఐఎం సైతం నాలుగైదు స్థానాల్లో లీడ్​లో ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img