కోలీవడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన సినిమా ‘కంగువ’. ఈ సినిమాలో సూర్యకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయినిగా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకి శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ కానుంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రివ్యూ వచ్చేసింది.
ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ తన రివ్యూను సోషల్ మీడియా ద్వారా ఉమేర్ సంధూ తెలిపారు. దుబాయ్ సెన్సార్ బోర్డ్ స్క్రీనింగ్ సమయంలో సినిమాను వీక్షించానని తెలిపిన ఉమేర్ సంధూ ఈ సినిమా రివ్వ్యూను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సినిమాలో సూర్య యాక్టింగ్ మేజర్ హైలైట్ అని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ సినిమాని చూడాలి అంటూ ట్విట్ చేసారు.