ఇదే నిజం, వెల్గటూర్: వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గంగుల నాగేష్ తండ్రి గంగుల సత్తయ్య మృతిచెందగా శనివారం రోజున మృతుని కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగుల అశోక్, మండల పార్టీ అధ్యక్షులు చల్లూరి రామచంద్ర గౌడ్, మూగాల సత్యం, జూపాక కుమార్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.