Homeహైదరాబాద్latest Newsఒక రింగ్ రోడ్డుతో మారనున్న ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తు.. ఇక పై వారికీ కాసుల...

ఒక రింగ్ రోడ్డుతో మారనున్న ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తు.. ఇక పై వారికీ కాసుల వర్షం..!

తెలంగాణలో రీజినల్ రింగ్ రోడ్డు ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో రియల్ ఎస్టేట్ రంగం అక్కడి ప్రాంతంలో అభివృద్ధి అవుతుంది అని తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఓఆర్‌ఆర్‌ రోడ్డుతో చుట్టూ పక్కన భూముల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుతో నగర శివారు ప్రాంతాల్లోనే కాకుండా జిల్లాల్లోనూ ధరలు పెరగనున్నట్టు తెలుస్తుంది. రీజినల్ రింగ్ రోడ్డు అనేక జిల్లాలను హైదరాబాద్‌తో కలుపుతుంది. హైదరాబాద్ చుట్టూ దాదాపు 340 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మించనున్నారు. దీంతో శంకర్‌పల్లి, యాచారం, ఇబ్రహీంపట్నం వంటి గ్రామీణ ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ఆస్తులకు డిమాండ్‌ బాగా పెరుగుతుంది.
ఈ రోడ్డు కానక పూర్తయితే దాని వెంట పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, హోటళ్లు తదితర అనేక నిర్మాణాలు చేపట్టాలని భావిస్తున్నారు. దీంతో ఈ రోడ్డు నిర్మించే ప్రాంతాల్లో భూముల ధరలకు మంచి గిరాకీ ఉంటుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తర భాగం నిర్మాణానికి అనుమతి లభించింది. సంగారెడ్డి, గజ్వేల్, భువనగిరి మార్గంలో నిర్మాణం జరగనుంది. దీంతో చౌటుప్పల్, పోచంపల్లి, భువనగిరి, బీబీనగర్, జగదేవ్‌పూర్, తుర్కపల్లి, వర్గల్, నాచారం, బొంతపల్లి, ఎల్దుర్తి, జోగిపేట ప్రాంతాల్లోని భూములకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. దక్షిణాది వైపు కూడా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో శంకర్‌పల్లి, చేవెళ్ల, షాద్‌నగర్‌, మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్‌, మాల్‌, ఇబ్రహీంపట్నం, మర్రిగూడెం ప్రాంతాల్లో భూముల ధరలు పెరగనున్నాయి.

Recent

- Advertisment -spot_img