ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 104, 108 ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు ఈ 22 నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకున్నారు. వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగులు సమ్మెను నుంచి వెనక్కి తగ్గారు. ఉద్యోగులను ఆప్కాస్ లో చేర్చడం, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజీ ప్రతిపాదనలు, శ్లాబ్ పద్ధతి వెంటనే అమలు చేస్తామని మంత్రి విడుదల రజినీ హామీ ఇచ్చారు. మంత్రి వేతనాలు ప్రతి నెల మొదటి వారంలోనే అందజేస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు యథావిధిగా విధులను కొనసాగిస్తున్నారు.