Homeజిల్లా వార్తలునిర్లక్ష్యం వహించకుండా ప్రభుత్వం కొనుగోళ్ళు చేపట్టాలి..!

నిర్లక్ష్యం వహించకుండా ప్రభుత్వం కొనుగోళ్ళు చేపట్టాలి..!

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు చేపట్టాలని గ్రామ కార్యదర్శి కి గ్రామ రైతులు వినతిపత్రం అందజేశారు.ఆ సందర్భంగా రైతు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు అధికారులు నాయకులు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా కొనుగోలు సెంటర్లలో అకాల వర్షాలకు తడుస్తూ ఎండకు ఎండుతూ రైతులు అరగోస పడుతున్న ప్రభుత్వం మాత్రం కాంటాలు ప్రారంభించక కొనుగోలు సెంటర్లలో ధాన్యమంతా తక్కువ ధరకే దళారుల పాలవుతుందని, ప్రభుత్వం రైతులపై పక్షపాతం చూపుతోందని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు లో నిర్లక్ష్యాన్ని వీడి ధాన్యమును కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు .

Recent

- Advertisment -spot_img