రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా సూపర్సిక్స్ హామీలను అమలు చేయాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మరో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. వచ్చే సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే అంశంపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలిసింది. దీనిపై క్లారిటీ వస్తే సర్కారు మరో హామీ నెరవేర్చినట్లు అవుతోంది.