Homeహైదరాబాద్latest Newsఎలాంటి హడావిడి లేకుండా.. పెళ్లి చేసుకున్న ఆ కుర్ర హీరో

ఎలాంటి హడావిడి లేకుండా.. పెళ్లి చేసుకున్న ఆ కుర్ర హీరో

తెలుగు యంగ్ హీరో విశ్వంత్ ‘కేరింత’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నడు. ఆ తరువాత అతను చేసిన ‘మనమంతా’, ‘జెర్సీ’, ‘ఓ పిట్ట కథ’, ‘కథ వెనక కథ’… వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఇప్పుడు ఈ హీరో ఓ ఇంటివాడు అయ్యాడు. ఇటీవలే గా ఈ హీరో తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బాయ్ చెప్పి భావన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ శుభవార్త సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో, అతని పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. విశ్వంత్ ఈ ఫోటోలను షేర్ చేసాడు. ఈ సంవత్సరం ఆగస్టులో విశ్వంత్ మరియు భావన నిశ్చితార్థం జరగగా, ఎలాంటి హడావిడి లేకుండా ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం విశ్వంత్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img