Homeహైదరాబాద్latest Newsఅర్ధరాత్రి తలుపు తట్టి ఆ హీరో హింసించేవాడు.. ఐశ్వర్య రాయ్ షాకింగ్ కామెంట్స్..!

అర్ధరాత్రి తలుపు తట్టి ఆ హీరో హింసించేవాడు.. ఐశ్వర్య రాయ్ షాకింగ్ కామెంట్స్..!

హీరోయిన్ ఐశ్వర్యరాయ్ 1994లో 21 ఏళ్ల వయసులో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. దీని తర్వాత మణిరత్నం దర్శకత్వం వహించిన ఇరువర్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, ఇంగ్లీషు ఇలా అన్ని భాషా సినిమాల్లో నటించింది. గతేడాది పొన్నీల సెల్వన్ భారీ విజయాన్ని అందుకుంది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ‘హమ్ దిల్ దే సుకే సనమ్‌’ అనే సినిమాలో సల్మాన్ ఖాన్ మరియు ఐశ్వర్య రాయ్ కలిసి నటించారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో నటిస్తున్నప్పుడు సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ మధ్య ప్రేమ చిగురించింది. రీల్ జంటగా ఉండే వీరిద్దరూ రియల్ జంటగా అనేక ప్రాంతాలు తిరిగారు. అయితే తమ ప్రేమ రెండేళ్లకు మించి నిలవలేదని, ఐశ్వర్యరాయ్‌తో చాలా దారుణంగా ప్రవర్తించాడని, ఐశ్వర్యను తన అధీనంలో ఉంచుకోవాలని సల్మాన్ ఖాన్ ప్రయత్నించాడని, సల్మాన్ అనుమతి లేకుండా ఏ సినిమాకు సైన్ చేయకూడదని, నటించకూడదని చాలా కండిషన్స్ పెట్టాడు.దీంతో విసిగిపోయిన ఐశ్వర్య సల్మాన్ ఖాన్‌ను చూడకుండా తప్పించుకుని రోజుల తరబడి బయటకు రాకుండా ఇంట్లోనే ఉండిపోయింది. దీంతో ఆగ్రహించిన సల్మాన్ ఖాన్ ఓ రోజు అర్ధరాత్రి ఐశ్వర్యరాయ్ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. ఇప్పుడు తలుపు తీయకుంటే 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఐశ్వర్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఐశ్వర్యరాయ్ ప్రముఖ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్‌’ లో తెలిపారు.gk 2 ఇదేనిజం అర్ధరాత్రి తలుపు తట్టి ఆ హీరో హింసించేవాడు.. ఐశ్వర్య రాయ్ షాకింగ్ కామెంట్స్..!

Recent

- Advertisment -spot_img