మరో మహిళతో సహజీవనం చేస్తూ భార్యకు అడ్డంగా దొరికాడు ఓ భర్త. ఈ ఘటన విశాఖపట్నంలోని సీతమ్మధారలోని చోటు చేసుకుంది. భర్త మరొక మహిళతో కలిసి వేరొకచోట కాపురం పెట్టాడనే విషయం తెలిసి అక్కడికి వెళ్లింది. రెడ్‌హ్యాండెడ్‌గా ఇద్దరినీ పట్టుకుని కుటుంబసభ్యులతో కలిసి వారిపై దాడి చేసింది. కొంతకాలంగా వివేక్ దంపతుల మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో.. మరో మహిళతో కలిసి ఉంటున్నాడు వివేక్. తనకు విడాకులు ఇవ్వకుండా వేరే మహిళతో ఉండడం ఏంటని ప్రశ్నిస్తుంచిన ఆమె.. తన కోపాన్నంతా చేతల్లో చూపించింది. పాలకొండకు చెందిన వివేక్‌కి, బుచ్చయ్య పేటకు చెందిన హరితకు 2020లో పెళ్లయ్యింది.. మూడు నెలలకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.. 2021 ఫిబ్రవరిలోనే భర్తపై హరిత కేసు పెట్టింది. ఆ తర్వాత విడాకుల పంచాయితీ మొదలైంది. అది తేలకుండా వివేక్ మరో మహిళతో కలిసి ఉంటున్నాడని తెలిసి హరిత వాళ్లపై దాడి చేసింది.