– 150 టార్టెట్లను పేల్చివేసినట్లు వెల్లడి
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ భీకర దాడి చేసింది. శుక్రవారం రాత్రి సుమారు 100 ఫైటర్ జెట్స్‌తో అటాక్ చేసినట్లు తెలుస్తోంది. హమాస్‌కు చెందిన వందలాది టార్గెట్లను ధ్వంసం చేశారు. సుమారు వంద ఫైటర్ జెట్స్‌తో అటాక్ చేశామని ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషనన్స్ బ్రిగేడర్ జనరల్ గిలాడ్ కీనన్ తెలిపారు. గాజా స్ట్రిప్‌లో ఉన్న ఉత్తర భాగాన్ని ఇజ్రాయిల్ దళాలు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. గ్రౌండ్ ఆపరేషన్‌కు చెందిన టెంపోను ఇజ్రాయిల్ ఆర్మీ పెంచుతున్నట్లు స్పష్టమవుతోంది. భారీ స్థాయిలో పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. వైమానిక దాడితో కమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ దెబ్బతింటున్నాయి.