Homeక్రైంRashmika ఫేక్ వీడియో కేసులో దర్యాప్తు ముమ్మురం

Rashmika ఫేక్ వీడియో కేసులో దర్యాప్తు ముమ్మురం

– బిహార్​ యువకుడిని ప్రశ్నిస్తున్న పోలీసులు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: స్టార్‌ హీరోయిన్‌ రష్మికకు సంబంధించిన మార్ఫింగ్‌ వీడియో వైరల్‌ కావడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తొలుత ఈ వీడియోను ఏ అకౌంట్‌ నుంచి అప్‌లోడ్‌ చేశారో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. రష్మిక నకిలీ వీడియో అప్‌లోడ్‌కు సంబంధించిన యూఆర్‌ఎల్‌ వివరాలు అందజేయాలంటూ ఫేస్‌బుక్‌ మాతృసంస్థ ‘మెటా’కు పోలీసులు లేఖ రాసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ఈ వీడియోను షేర్‌ చేసిన వారి వివరాలను కూడా లేఖలో కోరారు. ఈ కేసుతో సంబంధమున్న బిహార్‌కు చెందిన 19 ఏళ్ల ఓ యువకుడిని మంగళవారం పోలీసులు ప్రశ్నించారు. ఈ వ్యక్తి ఖాతా నుంచి ఫేక్‌ వీడియో తొలుత సోషల్‌ మీడియాలో అప్‌డోల్‌ చేసి ఉండొచ్చని.. ఈ తర్వాత ఇది వైరల్‌గా మారినట్లు అనుమానిస్తున్నారు. అయితే,ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. నిందితుడిని ప్రశ్నించగా.. తాను కేవలం ఓ సోషల్‌ ఫ్లాట్‌ఫారమ్‌ వేదికగా ఆ వీడియోను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు చెప్పినట్లు సమాచారం. దీనిపై ఇంకా అతడిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. డీప్‌ ఫేక్‌ వీడియో వ్యవహారాన్ని కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి సహా పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img