Homeఆంధ్రప్రదేశ్ముగిసిన ‘జలశక్తి శాఖ’ కీలక మీటింగ్​

ముగిసిన ‘జలశక్తి శాఖ’ కీలక మీటింగ్​

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సాగర్​ కాల్వ వివాదం నేపథ్యంలో కేంద్ర జలశక్తిశాఖ నిర్వహించిన సమావేశం ముగిసింది. ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్‌లు), సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు ఛైర్మన్‌లు నేరుగా పాల్గొన్నారు. నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాలు వాటికి అనుబంధంగా ఉన్న ఉమ్మడి నిర్మాణాలను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించే ప్రక్రియను కేంద్ర జలశక్తి శాఖ ప్రారంభించనుంది. గత మూడు రోజులుగా నాగార్జునసాగర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కేఆర్‌ఎంబీ పర్యవేక్షణలో ప్రాజెక్టులను సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ భద్రత పరిధిలోకి రెండు జలాశయాలను తీసుకురావాలని యోచన చేస్తోంది.

Recent

- Advertisment -spot_img