గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ఎస్.జె. సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే విడుదలైన టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా సంక్రాంతి పండుగా కానుకగా జనవరి 10న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే విడుదలకు ముందు, రామ్ చరణ్ 256 అడుగుల ఎత్తైన భారీ కటౌట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఫాన్స్ ఏర్పాటు చేసారు. ఈ కటౌట్ దేశంలోనే అతిపెద్దగా నిలిచింది.ప్రస్తుతం రామ్ చరణ్ కు సంబంధించిన ఈ కటౌట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో అభిమానుల్లో మరింత ఉత్కంఠ పెరిగింది.