Homeజాతీయంవివాహానికి చట్టబద్దమైన వయస్సు

వివాహానికి చట్టబద్దమైన వయస్సు

వివాహం మరియు మాతృత్వం యొక్క పరస్పర సంబంధాన్ని పరిశీలించడానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబడింది. (i) గర్భధ‌రించిన సమయంలోను శిశు జ‌న‌నం, ఆ తరువాత తల్లి మరియు న‌వ‌జాత శిశువు / శిశువు / ‌చిన్నారుల ఆరోగ్యం, వైద్య శ్రేయస్సు, పోషక స్థితితో పాటుగా (ii) శిశు మరణాల రేటు (ఐఎంఆర్‌), ప్రసూతి మరణాల రేటుతో (ఎంఎంఆర్‌) పాటుగా మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్‌), పుట్టినప్పుడు లింగ నిష్పత్తి (ఎస్ఆర్‌బీ), చైల్డ్ లింగ రేషియో (సీఎస్ఆర్‌) ఈ నేప‌థ్యంలో ఆరోగ్యం మరియు పోషణకు సంబంధించిన ప‌లు ఇతర సంబంధిత అంశాల‌ను గురించి అధ్య‌య‌నం చేసేందుకు గాను ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబడింది. ఈ టాస్క్ ఫోర్స్ యొక్క నివేదిక ప్రభుత్వానికి ఇంకా అంద‌లేదు.
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ ఈ రోజు రాజ్య‌స‌భ‌కు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ స‌మాచారాన్ని తెలియ‌జేశారు. 

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img