నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’. ఈ షో తెలుగు ఓటిటి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నాలుగవ సీజన్ మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 25 రాత్రి 8.30 నుండి ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌కు ఏపీ సీఎం నారాచంద్రబాబు నాయుడు అతిథిగా వచ్చారు. నాలుగో ఎపిసోడ్‌కి తమిళ స్టార్ హీరో సూర్య గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ ఎపిసోడ్ షూటింగ్ గురువారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది.
సూర్య హీరోగా నటించిన ‘కంగువా’ సినిమా నవంబర్ 14న థియేటర్లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌తో కలిసి సూర్య అన్‌స్టాపబుల్ షోకి వచ్చాడు. అయితే సూర్య అన్‌స్టాపబుల్ సెట్స్‌లోని ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.